Home  »  TV News  »  Brahmamudi : పెళ్లి చేసుకుని షాకిచ్చిన రాజ్-ఇందు.. రేఖ ఆగ్రహం!

Updated : May 9, 2026

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -1027 లో.....రాజు డ్రైవర్ గా వచ్చి ఇందుని కిడ్నాప్ చెయ్యాలని ప్లాన్ చేస్తాడు. ఇందుని తీసుకొని భ్రమరాంబ గుడికి వెళ్తుంటే దారిలో  ఆపి భ్రమరాంబకి కత్తి చూపించి బ్లాక్మెయిల్ చేస్తాడు. దాంతో  భ్రమరాంబ కార్ దిగుతుంది. ప్లీజ్ పిన్ని నన్ను కాపాడు అంటూ ఇందు యాక్టింగ్ చేస్తుంది. భ్రమరాంబ భయపడి అక్కడ నుండి వెళ్ళిపోయాక.. రాజు, ఇందు హైఫై ఇచ్చుకుంటూ  ఎలా యాక్టింగ్ చేసానని  అనుకుంటారు.

మరొకవైపు మదన్ ని పెళ్లి కొడుకులాగా రేఖ రెడీ చేస్తుంది. మదన్ డల్ గా ఉండడంతో నువ్వు  ఇలా చేస్తేనే ఈ ఆస్తులన్ని మన సొంతం అవుతాయని రేఖ చెప్తుంది. అప్పుడే స్వాతి వస్తుంది. ఈ పెళ్లికొడుకు డ్రెస్ లో ఎలా ఉన్నానని  మదన్ అడుగుతాడు. బాగున్నావ్  బావ అని స్వాతి డల్ గా చెప్తుంది. ఇంతకి  మీ అక్క వచ్చిందా అని రేఖ అడుగుతుంది. రాలేదని స్వాతి చెప్పగానే కోపంగా అపర్ణని పిలుస్తుంది రేఖ. ఇంకా నీ మనవరాలు రాకపోవడం ఏంటని కోప్పడుతుంది. ఇది బాగుంది.. నువ్వే మీ వదినని తోడు ఇచ్చి పంపించావ్.. ఇప్పుడు నన్ను అంటున్నావు  ఏంటని అపర్ణ కోప్పడుతుంది. అప్పుడే భ్రమరాంబ వచ్చి ఎవరో ఇందుని ఎత్తుకెళ్లారని చెప్పగానే అందరు షాక్ అవుతారు. పోలీస్ కంప్లైంట్ ఇద్దామని భూషణ్ అంటాడు. వద్దు మనం ఏ పరిస్థితిలో పెళ్లి చేస్తున్నామో తెలిసి కూడా  పోలీస్ కంప్లైంట్ ఏంటని రేఖ అంటుంది. ఇప్పుడు ఎవరు కిడ్నాప్ చేసారో కావాలని రేఖ అంటుంది. నిజం చెప్పు ఇదంతా నీ ప్లాన్ కదా అని అపర్ణని రేఖ అడుగుతుంది. కాదని అపర్ణ అంటుంది. నువ్వు  ఇలా చెప్తే ఎందుకు వింటావని  అపర్ణ తలకి  గన్ పెట్టి అడుగుతుంది రేఖ.

అప్పుడే రాజు, ఇందు పెళ్లి చేసుకొని ఎంట్రీ ఇస్తారు. వాళ్ళని చూసి అందరు షాక్ అవుతారు. రాజ్ నువ్వా అని రాజుని పట్టుకొని అపర్ణ ఎమోషనల్ అవుతుంది. అతను రాజు కాదు..వాడికి ఈ ఇంటికి ఎలాంటి సంబంధం లేదని రేఖ చెప్తుంది. నువ్వు ఏంటే పెళ్లి చేసుకొని వచ్చావని  ఇందుపై రేఖ కోప్పడుతుంది. ఇప్పుడు తను నా భార్య.. తనని ఒక్క మాట అనడానికి వీళ్లేదని రాజు చెప్తాడు. అసలు మా ఇందు ఎప్పుడు బయటకు వెళ్ళలేదు.. మొన్న కిడ్నాప్ అయినప్పుడు వారం రోజులు బయట  ఉందని శేషు అంటాడు. ఆ కిడ్నాప్ చేసింది నేనే అని రాజ్  అనగానే అందరు షాక్ అవుతారు. తరువాయి భాగంలో ఇందు మెడలో తాళిని  తియ్యబోతుంటే రాజు అడ్డుపడుతాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.






Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.